రెచ్చి పోయిన వెంకటేశ్ అయ్యర్
దంచి కొట్టిన రహమనుల్లా గుర్బాజ్
చెన్నై – తమిళనాడులోని చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన ఐపీఎల్ 2024 లీగ్ ఫైనల్ మ్యాచ్ లో దుమ్ము రేపారు కోల్ కతా ఆటగాళ్లు రహమనుల్లా గుర్బాజ్ , వెంకటేశ్ అయ్యర్. ముందుగా బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 18.1 ఓవర్లలోనే 113 పరుగులకే చాప చుట్టేసింది. ప్రధానంగా కోల్ కతా బౌలర్లు మిచెల్ స్టార్క్ , ఆండ్రీ రస్సెల్ కళ్లు చెదిరే బంతులతో కట్టడి చేశారు. హైదరాబాద్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
114 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన కోల్ కతా ఆడుతూ పాడుతూ ఛేదించింది. 17వ సీజన్ ఐపీఎల్ కప్ ను కైవసం చేసుకుంది. కోల్ కతా జట్టు తరపున గుర్బాజ్ 39 రన్స్ చేస్తే వెంకటేశ్ అయ్యర్ 52 పరుగులు చేశాడు.
ఐపీఎల్ చరిత్రలో ముచ్చటగా మూడోసారి కప్ ను కైవసం చేసుకుంది కేకేఆర్. ఆల్ రౌండ్ ప్రదర్శనతో కోల్ కతా తనే అసలైన, సిసలైన విజేతనంటూ ప్రకటించింది. ఇదిలా ఉండగా ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపిన హైదరాబాద్ బ్యాటర్లు ఆడటం చేతకాక చూస్తూ ఉండి పోయారు. వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టారు.