5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకు పోతున్న లక్నో సూపర్ జెయింట్స్ కు ఝలక్ ఇచ్చింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫినిషర్ గా పేరు పొందిన సీఎస్కే స్కిప్పర్ ఎంఎస్ ధోనీ లక్నో ఆశలపై నీళ్లు చల్లాడు. మరో వికెట్ పడకుండానే టార్గెట్ ను శివమ్ దూబేతో కలిసి పని పూర్తి చేశాడు. తను కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్ తో విరుచుకు పడ్డాడు. 43 ఏళ్లు అయినా తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపించాడు. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. లక్నో నిర్దేశించిన 167 పరుగులను 19.3 ఓవర్లలోనే పూర్తి చేసింది సీఎస్కే.
శివమ్ దూబే 37 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 2 సిక్స్ లతో 43 రన్స్ చేయగా. ధోనీ 11 బాల్స్ లో 4 ఫొర్లు ఒక సిక్స్ తో 26 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. బిష్ణోయ్ 18 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్లు కోల్పోయి 166 రన్స్ కే పరిమితమైంది. కెప్టెన్ రిషబ్ పంత్ 49 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 4 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 63 రన్స్ చేశాడు. ఈ టోర్నీలో ఇదే తన అత్యధిక స్కోర్. మిచెల్ మార్ష్ 30 రన్స్ చేశాడు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 24 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీస్తే పతిరాన 45 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. నూర్ అహ్మద్ 4 ఓవర్లు వేసి 13 పరుగులే ఇచ్చాడు.