ఊహించని షాక్ ఇచ్చిన సీఎస్కే
కోల్ కతా – కచ్చితంగా గెలవాల్సిన కీలక మ్యాచ్ లో స్వంత గడ్డపై కోల్ కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక చెన్నై కూడా అదే బాట పట్టింది. కానీ కోల్ కతాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. 2 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్ లు ఆడిన కేకేఆర్ 5 మ్యాచ్ లలో గెలిచింది. 6వ ప్లేస్ లో కొనసాగుతోంది. చెన్నైకి ఇది మూడో విజయం. చెన్నై 8 వికెట్లు కోల్పోయి 183 రన్స్ చేసింది. ఛేదనలో కోల్ కతా చతికిల పడింది. 6 వికెట్లు కోల్పోయి 179 రన్స్ చేసింది. నూర్ అహ్మద్ 31 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
కోల్ కతా స్కిప్పర్ కెప్టెన్ రహానే 33 బంతుల్లో 48 రన్స్ చేశాడు. 4 ఫోర్లు, 2సిక్స్‌లు ఉన్నాయి. రస్సెల్ 21 బంతుల్లో 38 పరుగులు చేయగా ఇందులో 4 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. మనీశ్ పాండే 36 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. బ్రెవిస్ 25 బంతులు ఆడి 52 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 4 సిక్స్ లు ఉన్నాయి. శివమ్ దూబే 45 రన్స్ చేశాడు. వైభవ్ అరోరా 48 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. రానా 43 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు కూల్చినా ఫలితం లేకుండా పోయింది.