కెప్టెన్ అయ్యర్..వధేరా సూపర్ ఇన్నింగ్స్
ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన కీలక లీగ్ పోరులో శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చిత్తుగా ఓడి పోయింది. ప్రస్తుతం 18వ సీజన్ కొనసాగుతోంది. పంజాబ్ కు రెండో గెలుపు సాధించింది. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కు షాక్ ఇచ్చింది. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ ఘోరంగా ఓటమి పాలైంది. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ 69 పరుగులతో చెలరేగి పోగా, స్కిప్పర్ అయ్యర్ 52 పరుగులతో రెచ్చి పోయి నాటౌట్ గా నిలిచాడు. 34 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 4 సిక్సర్లతో రెచ్చి పోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నేహాల్ వధేరా 3 ఫోర్లు 4 సిక్సర్లతో 43 రన్స్ తో కీలక పాత్ర పోషించాడు. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేధించింది. టోర్నీలో రెండు మ్యాచ్ లలో వరుస విజయంతో నాలుగు పాయింట్లు సాధించింది. అయ్యర్ సారథ్యంలో ఐపీఎల్ కప్ పై కన్నేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్. పూర్తిగా ఆల్ రౌండ్ షోతో అద్భుత ప్రదర్శనతో దుమ్ము రేపింది. మ్యాచ్ లో భాగంగా ముందుగా మైదానంలోకి దిగింది లక్నో సూపర్ జెయింట్స్. నిర్ణీత 20 ఓవర్లలో 172 రన్స్ చేసింది. ఆర్య 8 పరుగులకే ఔట్ కాగా ప్రభ్ సిమ్రన్ సింగ్ ఒక్కడే అద్భుతంగా ఆడాడు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 69 రన్స్ తో ఆకట్టుకున్నాడు.