8 వికెట్ల తేడాతో అద్భుత విజయం
చెన్నై – చెన్నై చేపాక్ స్టేడియం వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సీఎస్కేను 8 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ ఓడి పోయి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 రన్స్ చేసింది.
కోల్ కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 57 డాట్ బాల్స్ వేయడం విశేషం. \రచిన్ రవీంద్ర 4, కాన్వే 12, త్రిపాఠి 16, విజయ్ శంకర్ 29 , శివమ్ దూబే 31, అశ్విన్1, జడేజా , హూడా డకౌట్ అయ్యారు.
ఇక కేకేఆర్ బౌలర్లలో అలీ 1, సునీల్ నరైన్ 3, వరుణ్ చక్రవర్తి 2, హర్షిత్ రాణా 2 వికెట్లు తీశాడు. అనంతరం బరిలోకి దిగిన కేకేఆర్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ఛేదించింది. సునీల్ సరైన్ రెచ్చి పోయాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో 44 రన్స్ చేశాడు. చెన్నైకి ఇది వరుసగా ఐదో ఓటమి కావడం విశేషం. మ్యాచ్ విషయానికి వస్తే శివమ్ దూబే ఒక్కడే మేలనిపించాడు. ఇక సునీల్ నరైన్ కేవలం 13 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ కేవలం 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
కోల్ కతా స్పిన్నర్ల ధాటికి చెన్నై బ్యాటర్లు విల విల లాడారు. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా వైదొలగడంతో సారథ్య బాధ్యతలు ధోనీ చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. తను కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ బాట పట్టాడు.