రాణించిన రఘువంశీ..రింకూ సింగ్
ఢిల్లీ – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. అన్ని జట్లు అద్భుతంగా ఆడుతున్నాయి. చివరకు ప్లే ఆఫ్స్ కు ఏ జట్లు చేరుకుంటాయనేది ఉత్కంఠ రేపుతోంది. తాజాగా ఢిల్లీ వేదికగా స్వంత గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్ ఇచ్చింది కోల్ కతా నైట్ రైడర్స్. సమిష్టిగా రాణించడంతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. 14 రన్స్ తేడాతో ఓడించింది. కేకేఆర్ తరపున రఘువంశీ, రింకూ సింగ్ కీలక పాత్ర పోషించారు. బౌలింగ్ పరంగా వరుణ్ చక్రవర్తి, సునీల్ సరైన్ అద్భుతమైన బౌలింగ్ తో కట్టడి చేశారు. కోలుకోలేని దెబ్బ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 204 రన్స్ చేసింది. అనంతరం ఛేదనలో చతికిల పడింది. 9 వికెట్లు కోల్పోయి 190 రన్స్ కే పరిమితమైంది.
అజింక్యా రహానే సారథ్యంలోని కోల్ కతా జట్టు చావో రేవో తేల్చుకోవాల్సిన సమయంలో అద్భుతంగా ఆడింది. రఘువంశీ 32 బాల్స్ ఎదుర్కొని 44 రన్స్ చేశాడు. 3 ఫోర్లు 2 సిక్స్ లు, రింకూ సింగ్ 25 బంతుల్లో 35 పరుగులు చేశాడు. 3 ఫోర్లు ఒక సిక్స్ సాధించాడు. అనంతరం మైదానంలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కోల్ కతా బౌలర్ల మ్యాజిక్ ముందు తేలి పోయింది. ప్లాఫ్ డుప్లెసిస్ అద్భుతంగా ఆడాడు. కానీ జట్టును గెలిపించ లేక పోయాడు. తను 62 రన్స్ చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ 43 రన్స్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక కోల్ కతా బౌలర్లలో సరైన్ 29 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. వరుణ్ 39 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.