ఐపీఎల్ వేలం పాటలో రూ. 27 కోట్లు
లక్నో – ఐపీఎల్ మెగా వేలం పాటలో రూ. 27 కోట్ల అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆటగాడు రిషబ్ పంత్. తనను లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ఏరికోరి ఎంచుకుంది. తీరా 18వ సీజన్ ప్రారంభమైనా తన ఆటతీరులో ఇంకా మార్పు రాలేదు. కెప్టెన్ గా , ఆటగాడిగా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకు తను ఆడిన నాలుగు మ్యాచ్ లలో చేసిన పరుగులు కేవలం 19 మాత్రమే. ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించాడు ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా. తను అందరి ముందే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా లక్నో వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో 2 పరుగులే చేసి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
తాజాగా జరిగిన లీగ్ మ్యాచ్ లో లక్నో 12 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది. ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి ఓవర్ వరకు ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేని స్థితి నెలకొంది. వరుస వైఫల్యాలతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న కెప్టెన్ పంత్ ఈ మ్యాచ్ లో కూడా నిరాశ పరిచాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్, బ్యాటింగ్ పరంగా పర్ ఫార్మెన్స్ చేసినా అపజయం నుంచి గట్టెక్కించ లేక పోయాడు. సూర్య క్రీజ్ లో ఉన్నంత సేపు అంతా ముంబై గెలుస్తుందని అనుకున్నారు.