16 పరుగుల తేడాతో పరజాయం
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో అత్యంత ఉత్కంఠను రేపింది పంజాబ్స్ కింగ్స్ ఎలెవన్ , కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్. అత్యల్ప స్కోర్ ను ఛేదించే క్రమంలో బోర్లా పడింది కేకేఆర్. టాప్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కమాల్ చేశాడు. గెలవదని డిసైడ్ అయిన క్రమంలో మ్యాచ్ ను పూర్తిగా మార్చేశాడు. పంజాబ్ కు అపూర్వమైన విజయాన్ని కట్టబెట్టడంలో కీలక రోల్ పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు 4 వికెట్లు తీసి. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 111 పరుగులకే పరిమితమైంది. బరిలోకి దిగిన కోల్ కతా 95 పరుగులకు ఆలౌటైంది. 16 రన్స్ తేడాతో ఓడి పోయింది.
మ్యాచ్ పరంగా చూస్తే 7.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 62 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ యుజ్వేంద్ర చాహల్ కళ్లు చెదిరే బంతులకు వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టారు ఆటగాళ్లు. మణికట్టు మంత్రజాలం అంటే ఏమిటో చూపించాడు. 22 రన్స్ తేడాతో 6 వికెట్లు కోల్పోయింది. రస్సెల్ క్రీజులో ఉండడంతో మ్యాజిక్ చేస్తాడని భావించారు. చాహల్ బౌలింగ్ లో 2 సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టాడు. దీంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది. చివరకు 95 రన్సకే పరిమితమైంది. ఐపీఎల్ లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారీ లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ ఇదే రీతిన అత్యల్ప స్కోర్ లో సైతం గ్రాండ్ విక్టరీ నమోదు చేయడం విశేషం.