37 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ
ధర్మశాల వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్. 38 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకు వెళ్లేందుకు రెడీ అయ్యింది. పాయింట్ల పట్టికలో టాప్ లోకి దూసుకు వెళ్లింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీగా వచ్చాక ఆ జట్టు స్వరూపమే మారి పోయింది. తాడో పేడో తేల్చుకునేందుకు ప్రతి మ్యాచ్ కు సన్నద్దం అవుతున్నారు. పాయింట్ల పట్టికలో 2వ స్థానంలోకి చేరుకుంది. పంజాబ్ ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు 7 సిక్సర్లతో ఉతికి ఆరేశాడు. 91 రన్స్ చేశాడు.
అయ్యర్ 45, శశాంక్ సింగ్ 35 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. బరిలోకి దిగిన లక్నో 7 వికెట్లు కోల్పోయి 199 రన్స్ కే పరిమితమైంది. అంతకు ముందు లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు సింగ్. ఇక లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఆయుష్ బదోనీ దుమ్ము రేపాడు. తను 74 రన్స్ యేశాడు. సమద్ 45 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. మిగతా ఆటగాళ్లు ఎవరూ ఆశించిన మేర రాణించలేక పోయారు. మిచెల్ మార్ష్ డకౌట్ కాగా కెప్టెన్ రిషబ్ పంత్ 18 రన్స్ తో నిరాశ పరిచాడు. మార్కరమ్ 13, మిల్లర్ 11 పరుగులకే పరిమితమయ్యారు. అర్ష్ దీప్ సింగ్ 16 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఒమర్జారాయ్ 33 రన్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు.