6 వికెట్ల తేడాతో అద్భుత విజయం
బెంగళూరు – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో స్వంత గడ్డపై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. హర్షల్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ కేపిటల్స్ జట్టు ఆర్సీబీకి చుక్కలు చూపించింది. 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. తన జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఒకానొక దశలో 4 వికెట్లు కోల్పోయినా ఎక్కడా తగ్గలేదు. ఆర్సీబీ బౌలర్ల భరతం పట్టాడు. కళ్లు చెదిరే షాట్స్ కొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు.
ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరింది. 53 బంతులు ఎదుర్కొని రాహుల్ 93 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. తనకు స్టబ్స్ తోడుగా ఉన్నాడు. తను 38 పరుగులు చేశాడు. మ్యాచ్ లో భాగంగా టాస్ ఓడి పోయిన ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 రన్స్ చేసింది. ఫిల్ సాల్ట్ 17 బాల్స్ ఎదుర్కొని 4 ఫోర్లు 3 సిక్సర్లతో 37 పరుగులు చేయగా టిమ్ డేవిడ్ 20 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 37 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లు కుల్దీప్ యాదవ్ 17 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడగా నిగమ్ 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.