Friday, April 4, 2025
HomeSPORTSజాస్ బ‌ట్ల‌ర్ జోష్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ జోరు

జాస్ బ‌ట్ల‌ర్ జోష్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ జోరు

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు షాక్

బెంగ‌ళూరు – ఐపీఎల్ 2025 టోర్నీలో స్వంత గ‌డ్డ‌పై బిగ్ షాక్ త‌గిలింది ఆర్సీబీకి. బెంగ‌ళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్ లో బోల్తా ప‌డింది. గుజ‌రాత్ టైటాన్స్ దెబ్బ‌కు విల విల లాడింది. హైద‌రాబాద్ పేస‌ర్ సిరాజ్ అద్భుత‌మైన బౌలింగ్ , జోస్ బ‌ట్ల‌ర్ విధ్వంస‌క‌ర‌మైన ఇన్నింగ్స్ తో గుజ‌రాత్ టైటాన్స్ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. గెలుపు బాట‌లో ఉన్న బెంగ‌ళూరుకు బ్రేక్ వేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి చుక్క‌లు చూపించాడు సిరాజ్. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 169 ర‌న్స్ చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 2 వికెట్లు కోల్పోయి గెలుపొందింది.

ఏకంగా 8 వికెట్ల తేడాతో చుక్క‌లు చూపించింది. మ్యాచ్ ప‌రంగా చూస్తే ఆర్సీబీలో లివింగ్ స్టోన్ 40 బాల్స్ ఎదుర్కొని ఒక ఫోర్ , 5 సిక్స్ ల‌తో 54 ర‌న్స్ చేశాడు. సిరాజ్ కేవ‌లం 19 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. సాయి కిషోర్ 22 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సిరాజ్ దెబ్బ‌కు సాల్ట్ , ప‌డిక్క‌ల్ పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. అనంత‌రం బరిలోకి దిగిన గుజ‌రాట్ టైటాన్స్ 17.5 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. బ‌ట్ల‌ర్ దుమ్ము రేపాడు. కేవ‌లం 39 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 73 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. సుద‌ర్శ‌న్ 49, రూత‌ర్ ఫోర్డ్ 30 చేశారు. భువీ 1, హాజిల్ వుడ్ 1 వికెట్ తీశాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments