బెంగళూరు వర్సెస్ కోల్ కతా మ్యాచ్ రద్దు
బెంగళూరు – బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన కీలక లీగ్ మ్యాచ్ రద్దయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య తీవ్ర వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అంపైర్లు . చాలా సేపటి వరకు వేచి చూశారు. మ్యాచ్ ను నిర్వహించేందుకు ఎలాంటి ఆస్కారం లేక పోవడంతో గత్యంతరం లేక లీగ్ మ్యాచ్ ను నిర్వహించ లేమంటూ చేతులెత్తేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ను కేటాయించారు.
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో ఈ ఒక్క పాయింట్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో 17 పాయింట్లు సాధించి నెంబర్ 1 కి చేరుకుంది. టోర్నీలో భాగంగా ఇంకా 16 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఇవాళ కీలకమైన మరో లీగ్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ , శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్లు తలపడనున్నాయి.
ఇదిలా ఉండగా ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ పేలవమైన పర్ ఫార్మెన్స్ తో టోర్నీలో చతికిల పడింది. మూడు మ్యాచ్ లు కేవలం 1, 2 పరుగుల తేడాతో పోగొట్టుకుంది. ఇలా ఆడడం పట్ల పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఆరోపించింది. దీనిని ఖండించింది రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్. ఈ మ్యాచ్ లో శాంసన్ ఆడతాడా లేక ద్రవిడ్ పక్కన పెడతాడా అనేది వేచి చూడాలి.