ఐపీఎల్ లో రిషబ్ పంత్ ఫెయిల్
దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 వేలం పాటలో అత్యధిక ధరకు అమ్ముడు పోయాడు క్రికెటర్ రిషబ్ పంత్. తనను ఏరికోరి లక్నో సూపర్ జెయింట్స్ భారీ ధరకు కొనుగోలు చేసి ఇతర ఫ్రాంచైజీలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇదే సమయంలో వచ్చీ రావడంతోనే తన జట్టుకు పంత్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. తీరా చూస్తే ఏదో ఆడుతాడని, గట్టెక్కిస్తాడని అనుకుంటే జట్టు యాజమాన్యంతో పాటు అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. ఇప్పటి వరకు టోర్నీలో మూడు మ్యాచ్ లు ఆడితే తాను రెండెంకల స్కోర్ కూడా చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్ కు గురవుతున్నాడు.
విచిత్రం ఏమిటంటే ఐపీఎల్ లో భారీ ధరకు పలికిన ఆటగాళ్లు చాలా మంది ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇదే సమయంలో తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై అద్భుతంగా ఆడాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. ఆ తర్వాతి రెండు మ్యాచ్ లలో నిరాశ పరిచాడు. ఇక ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలలో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు రిషబ్ పంత్. కానీ కనీస ప్రదర్శన కూడా చేయక పోవడం పట్ల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదే సమయంలో మేనేజ్మెంట్ సైతం ఆందోళన చెందుతోంది. ఇక పంత్ విషయానికి వస్తే మూడు మ్యాచ్ లలో తను చేసిన స్కోర్ 15, 0, 2 రన్స్. మొత్తం చేసిన పరుగులు 17.