ఉప్పల్ స్టేడియంలో ఇవాళ నువ్వా నేనా
హైదరాబాద్ – ఐపీఎల్ 2025లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో కీలకమైన లీగ్ మ్యాచ్ కు వేదిక కానుంది. ఇప్పటికే టోర్నీలో ఛాంపియన్ ఫెవరేట్ గా ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఈ జట్టు దుర్బేధ్యంగా ఉంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటుతోంది. లీగ్ లో భాగంగా తొలి మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించింది. భారీ స్కోర్ సాధించింది. ముంబై క్రికెటర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ సైతం పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
ఆ జట్టు ఇంకా బోణీ కొట్టలేదు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు స్వంత గడ్డపై హైదరాబాద్ జోరు మీదుంది. ఐపీఎల్ మెగా టోర్నీలో పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ లో ఉంది. ఇటు రన్ రేట్ పరంగా అటు బలాబలాల పరంగా ఎలా చూసినా హైదరాబాద్ హాట్ ఫెవరేట్ గా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మాజీ క్రికెటర్లు, అనలిస్టులు మూకుమ్మడిగా ఈసారి టోర్నీ లో ఎస్ ఆర్ హెచ్ గెలవడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముందు బ్యాటింగ్ చేసినా భారీ స్కోర్ చేస్తున్నారు. ఒకవేళ టార్గెట్ నిర్దేశించినా దానిని సులువుగా ఛేదిస్తున్నారు. దీంతో ప్రత్యర్థి జట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొరకొర రాని కొయ్యగా మారింది జట్టు.