యువత రాజకీయాల్లోకి రావాలి
కైరానా ఎంపీ ఇక్రా హసన్ పిలుపు
ఉత్తర ప్రదేశ్ – యూపీలో సమాజ్ వాది పార్టీ దుమ్ము రేపింది. యోగి ఆదిత్యా నాథ్ సారథ్యంలోని బీజేపీ కి బిగ్ షాక్ ఇచ్చింది. పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నీ తానై ముందుండి నడిపించారు. ఈసారి ఎన్నికల్లో భిన్నంగా వ్యవహరించారు. యువతకు ఎక్కువగా సీట్లు కేటాయించారు. 80 సీట్లకు గాను ఏకంగా ఎస్పీకి 36 సీట్లు వచ్చాయి. ఈ ఫలితాలు కాషాయ శ్రేణులను నివ్వెర పోయేలా చేశాయి.
ఇదిలా ఉండగా కైరానా లోక్ సభ స్థానం నుండి యువ నాయకురాలు ఇక్రా హసన్ గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. ఈ సందర్బంగా గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తన సోదరుడు, తల్లిపై ఫేక్ కేసు నమోదు చేశారని ఆరోపించారు. వారు రాజకీయాలకు రాకుండా ఉండేలా చేశారని వాపోయారు.
ఆ సమయంలో నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఇదే రంగంలో తాను మూడేళ్ల నుండి క్రియాశీలకంగా ఉన్నానని అన్నారు ఇక్రాహసన్. .నాలాంటి యువతీ యువకులు రాజకీయాల్లోకి రావాలని, కొంత మార్పు తీసుకురావాలని కోరారు. కష్ట పడితే ఫలితం తప్పకుండా వస్తుందని తనను చూస్తే తెలుస్తుందన్నారు ఎంపీ.
ఇదిలా ఉండగా ఇక్రా హసన్ దివంగత ఎంపీ మున్వరర్ హసన్ కూతురు. ఆమె సోదరుడు నహిద్ హసన్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు.