NEWSINTERNATIONAL

ఇజ్రాయెల్ పై యుద్దానికి సిద్దం కండి

Share it with your family & friends

ఇరాన్ చీఫ్ అలీ ఖ‌మేనీ ఆదేశం

ఇరాన్ – ఇరాన్ దేశ సుప్రీం నాయ‌కుడు అలీ ఖ‌మేనీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ దేశానికి చెందిన హ‌మాస్ చీఫ్ లీడ‌ర్ తో పాటు ఆయ‌న అంగ ర‌క్ష‌కుడిని ఇజ్రాయెల్ మూకలు దాడికి పాల్ప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో హ‌మాస్ చీఫ్ ఖ‌తం అయ్యారు. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు ప్రాణాలు కోల్పోయారు.

ఇదిలా ఉండ‌గా ఇజ్రాయెల్ హ‌మాస్ చీఫ్ ఖ‌తం అయ్యాడ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురిని లేపేశామ‌ని, ఇంకా ఇద్ద‌రు లీడ‌ర్లు మిగిలి ఉన్నార‌ని , వారిని కూడా ఈ భూమి మీద లేకుండా చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఇది మ‌రో యుద్దానికి దారి తీసేలా త‌యార‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని ఇత‌ర దేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి.

కాగా హ‌మాస్ చీఫ్ ఇస్మాయెల్ ను చంప‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించింది ఇరాన్ . ఈ మేర‌కు దేశ అధ్య‌క్షుడు అలీ ఖ‌మేనీ గురువారం స్పందించారు. ఇజ్రాయెల్ పై దాడి చేయాల‌ని దేశ సైనిక రంగాన్ని ఆదేశించారు. ఇందు కోసం సాయుధ ద‌ళాలు అప్రమ‌త్ం కావాల‌ని, వీలైతే యుద్దానికి సిద్దం కావాల‌ని పిలుపునిచ్చారు ఇరాన్ చీఫ్‌.

ఇరాన్ దేశం అత్యున్న‌త స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్బంగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు చీఫ్ ఖ‌మేనీ. గ‌త రాత్రి టెహ్రాన్ లో హ‌మాస్ చీఫ్ ఇస్మాయిల్ హ‌నియెహ్ హ‌త్య‌కు ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని ఆదేశించారు.