ఆత్మ రక్షణ కోసం ఇజ్రాయెల్ పై దాడి
తప్పదని వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ చీఫ్
ఇరాన్ – ఐక్య రాజ్య సమితి జనరల్ సెక్రటరీకి బిగ్ షాక్ ఇచ్చారు ఇరాన్ దేశ అధ్యక్షుడు అలీ ఖమేనీ . తాజాగా ఇజ్రాయెల్ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని, పదే పదే దాడులకు దిగుతోందని ఆరోపించారు. ఇదే సమయంలో తమ దేశానికి చెందిన ప్రముఖ నాయకుడు , హమాస్ సంస్థ చీఫ్ ఇస్మాయెల్ తో పాటు అంగరక్షకులను ఎయిర్ క్రాఫ్ట్ దాడుల్లో హత మార్చడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఇరాన్ చీఫ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా హమాస్ చీఫ్ అంతిమ యాత్రకు వేలాది మంది జనం హాజరయ్యారు. కన్నీటి నివాళులు అర్పించారు. ర్యాలీని ఉద్దేశించి ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ సంచలన ప్రకటన చేశారు.
ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష యుద్దానికి సిద్దం కావాలంటూ తమ దేశానికి చెందిన సైనిక, వైమానిక దళాలను ఆదేశించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో యుఎన్ జనరల్ సెక్రటరీ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో ఫోన్ లో మాట్లాడారు.
ఆత్మ రక్షణ కోసం ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడికి పాల్పడతామని హెచ్చరించారు. యుఎన్ చార్టర్ లోని ఆర్టికల్ 51ని ఈ సందర్బంగా గుర్తు చేసింది.