ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష యుద్ధం తప్పదు
హెచ్చరించిన ఇరాన్ చీఫ్ ఖొమేనీ
ఇరాన్ – ఇరాన్ దేశ అధ్యక్షుడు ఆయతుల్లా ఖొమేనీ నిప్పులు చెరిగారు. ఇజ్రాయెల్ దేశానికి స్ట్రాంగ్ వార్నంగ్ ఇచ్చారు. శుక్రవారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. విచిత్రం ఏమిటంటే ఆయన 5 సంవత్సరాల తర్వాత ప్రజల కోసం రావడం విస్తు పోయేలా చేసింది.
భారీ ఎత్తున హాజరైన జనాన్ని ఉద్దేశించి భావోద్వేగంతో ప్రసంగించారు ఖొమేనీ. ఇంతకాలం ఓపికతో ఉన్నామని, కానీ ఇజ్రాయెల్ తమను తక్కువగా అంచనా వేస్తోందన్నారు. ఇక ఉపేక్షించే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు ఆ దేశ అధ్యక్షుడు నెతన్యాహూకు.
ఇదే సమయంలో అమెరికాపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరాన్ ప్రెసిడెంట్. ఇది మంచి పద్దతి కాదన్నారు ఖొమేనీ. ఆయన తన పక్కన రైఫిల్ పెట్టుకోవడం కూడా విస్తు పోయేలా చేసింది.
ఇజ్రాయెల్ ఎక్కువ కాలం నిలబడదన్నాడు. ఉమ్మడి శత్రువుకి వ్యతిరేకంగా ముస్లిం దేశాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అశాంతిని ప్రేరేపించినందుకు అమెరికాను ఖమేనీ తప్పుపట్టారు. తమ మాతృ భూమిని రక్షించు కోవడానికి పాలస్తీనియన్ హక్కులను పునరుద్ఘాటించడం అత్యంత అవసరమని స్పష్టం చేశారు.