NEWSINTERNATIONAL

ఇరాన్ చీఫ్‌..మంత్రి మృతి

Share it with your family & friends

హెలికాప్ట‌ర్ ఘ‌ట‌న‌పై స్పంద‌న

ఇరాన్ – ఇరాన్ లో విషాదం అలుముకుంది. ఇరాన్ అధ్య‌క్షుడు ఇబ్ర‌హీం రైసీతో పాటు ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దోల్లాహియాన్ సైతం హెలికాప్ట‌ర్ కూలిన ఘ‌ట‌న‌లో మృతి చెందిన‌ట్లు ఇరాన్ ప్ర‌క‌టించింది. వీరితో పాటు ఇత‌ర అధికారులు సైతం ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వెల్ల‌డించింది.

వాయ‌వ్య ప్రాంతంలో వాతావ‌ర‌ణం స‌రిగా లేనందు వ‌ల్ల‌నే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని తెలిపింది. రెస్క్కూ బృందాలు ఇంకా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయ‌ని, కానీ వాతావ‌ర‌ణం అనుకూలించ‌డం లేద‌ని పేర్కొంది.

సుంగున్ అనే రాగి గని సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింద‌ని స్ప‌ష్టం చేసింది ఇరాన్ స‌ర్కార్. ఇది ఇరాన్‌లోని తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని జోల్ఫా , వర్జాకాన్ మధ్య ఉంది .ఘ‌ట‌న జ‌రిగిన విష‌యం తెలిసిన వెంట‌నే 40 ప్ర‌త్యేక రెస్క్యూ బృందాల‌ను పంపించారు. అయినా లాభం లేకుండా పోయింద‌ని పేర్కొంది ఇరాన్.

ఇరాన్ కు క‌ష్ట కాలంలో సాయం చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని ట‌ర్కీ, ఇట‌లీ, ఖ‌తార్ ఇత‌ర దేశాల అధ్య‌క్షులు, పీఎంలు ప్ర‌క‌టించారు.