లక్నో ఆశలకు ఇషాంత్ బ్రేక్
శర్మ బౌలింగ్ కు విలవిల
న్యూఢిల్లీ – ఐపీఎల్ 2024లో భాగంగా అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్ము రేపింది. ప్లే ఆఫ్స్ కు చేరుకోక పోయినా వెళ్లాలని అనుకున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. ప్రధానంగా ఢిల్లీ టీం కు చెందిన స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మ రెచ్చి పోయాడు. అద్బుతమైన బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు.
కేవలం 34 పరుగులు మాత్రమే ఇచ్చిన ఇషాంత్ శర్మ కీలకమైన మూడు వికెట్లను తీశాడు. దీంతో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తను టోర్నీ నుంచి నిష్క్రమించడమే కాకుండా లక్నోను కూడా వెంట తీసుకు వెళ్లింది. దీంతో ప్లే ఆఫ్స్ కు రాజస్థాన్ రాయల్స్ వెళ్లి పోయింది. ఆ జట్టు ఇంకా 2 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
ఇక ఇషాంత్ శర్మ అద్భుతమైన బంతులు వేయడంతో పరుగులు చేసేందుకు తంటాలు పడ్డారు. కెప్టెన్ రాహుల్ కేవలం 5 రన్స్ మాత్రమే చేసి ముకేష్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్వింటన్ డికాక్ 11 రన్స్ వద్ద శర్మ చేతికి చిక్కాడు. 5వ ఓవర్ లో దీపక్ హూడాను పెవిలియన్ దారి పట్టించాడు. మొత్తంగా ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు ఇషాంత్.