అవును మేమే దాడి చేశాం
ప్రకటించిన ఉగ్రవాద సంస్థ
రష్యా – ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించింది రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు జరిపిన దాడి. నగరంలోని క్రోకస్ సిటీ హాల్ పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా బాంబులు విసిరారు. ఆపై బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు. అప్పటికే రష్యా దళాలు ఎంటర్ అయ్యాయి. ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు తీవ్రవాదులు బలయ్యారు.
ఇదిలా ఉండగా ఈ ఘటనలో అక్కడికక్కడే 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంగణమంతా రక్తంతో తడిసి పోయింది. మరో 145 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా మాస్కో దాడి ఘటనకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ప్రపంచ ఉగ్రవాద సంస్థ ఐసీఐఎస్ . ఈ ఘటనకు తామే పూర్తి బాధ్యత వహిస్తున్నామని ప్రకటించింది. ఇదిలా ఉండగా ఈ ఉగ్రవాద సంస్థకు వేదికగా ఉన్న సిరియాపై నిప్పులు చెరిగారు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. తమ దళాలను అక్కడికి పంపుతున్నట్లు స్పష్టం చేశారు.