ఇజ్రాయెల్ ఎవరికీ తల వంచదు – నెతన్యాహు
ప్రాన్స్ అధ్యక్షుడిపై తీవ్ర ఆగ్రహం
ఇజ్రాయెల్ – దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశం ఎవరికీ తల వంచదని స్పష్టం చేశారు. ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు మాక్రాన్ ఆయుధాలపై నిషేధం విధించాలని పిలుపు ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నెతన్యాహూ.
ఇవాళ ఇజ్రాయెల్ నాగరికతకు సంబంధించిన శత్రువులకు వ్యతిరేకంగా ఏడు రంగాల్లో తనను తాను రక్షించుకుంటుందని ప్రకటించారు. హమాస్‌కు వ్యతిరేకంగా తాము గాజాలో పోరాడుతున్నామని అన్నారు.
హత్యలు, అత్యాచారాలు, తలలు నరికి, కాల్చి వేస్తుంటే ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. లెబనాన్‌లో ప్రపంచంలోనే అత్యంత భారీ సాయుధ ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్లాకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని తెలుసు కోవాలని అన్నారు.
మా ఉత్తర సరిహద్దులో భారీ మారణకాండను ప్లాన్ చేస్తోందన్నారు. దాదాపు ఒక సంవత్సరం పాటు ఇజ్రాయెల్ పట్టణాలు , నగరాలను రాకెట్‌లోకి నెట్టిందన్నారు. తాము యెమెన్‌లోని హౌతీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని తెలిపారు నెతన్యాహూ.
ఇరాక్ , సిరియాలోని షియా మిలీషియాలు కలిసి ఇజ్రాయెల్‌పై వందలాది డ్రోన్‌లు క్షిపణి దాడులను ప్రారంభించాయని ఆరోపించారు, తాము ఇరాన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నామని అన్నారు, ఇది గత వారం ఇజ్రాయెల్‌పై నేరుగా 200 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందన్నారు.
ఇరాన్ నేతృత్వంలోని అనాగరిక శక్తులతో ఇజ్రాయెల్ పోరాడుతున్నప్పుడు, అన్ని నాగరిక దేశాలు నిలబడి ఉండాలని అన్నారు. అయినప్పటికీ అధ్యక్షుడు మాక్రాన్ , మరికొందరు పాశ్చాత్య నాయకులు ఇప్పుడు ఇజ్రాయెల్‌పై ఆయుధ నిషేధానికి పిలుపును ఇవ్వడం దారుణమన్నారు బెంజమన్ నెతన్యాహు.
ఇరాన్ కు వ్యతిరేకంగా జరిగే ఈ యుద్దంలో అంతిమ విజయం ఇజ్రాయెల్ దేనని గుర్తు పెట్టు కోవలని హెచ్చరించారు నెతన్యాహూ.