అంతరిక్ష పరిశోధనలపై ఫోకస్
ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి
బెంగళూరు – ఇస్రో చైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 42వ ఇంటర్-ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ వార్షిక సమావేశం బెంగళూరు నగరంలో జరిగింది. ఈ సందర్బంగా ఇస్రో చైర్మన్ మాట్లాడారు.
ఇస్రోకి సంబంధించినంత వరకు అంతరిక్ష పరిశోధన, అంతరిక్ష వినియోగంలో తమకు చాలా స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. ప్రస్తుతం తాము కక్ష్యలో 54 అంతరిక్ష నౌకలను కలిగి ఉన్నామని చెప్పారు, ఇంకా పని చేయని వస్తువులు ఉన్నాయని తెలిపారు.
అవి నిర్మూలించ బడిన తర్వాత, వాటిని సురక్షితంగా తీసుకు రావడానికి అంతరిక్ష వస్తువులను పార వేసేందుకు లేదా దాని క్రియాశీల పాత్ర నుండి తీసి వేయడానికి తాము చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు సోమనాథ్
ముఖ్యమైన అంశాలలో స్థానం ఒకటి…రాకెట్ లేదా అంతరిక్ష నౌక ఎగువ దశలతో సహా తాము ప్రయోగించే సిస్టమ్ లు కీలకంగా ఉన్నాయన్నారు ఇస్రో చైర్మన్. జాగ్రత్తగా డిజైన్ చేయడం , అమలు చేయడంపై ఫోకస్ పెట్టడం జరుగుతుందన్నారు.