ఓటు ఆయుధం అభివృద్దికి సోపానం
ఐశ్వర్య డీకే శివకుమార్ హెగ్డే కామెంట్
కర్ణాటక – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూతురు ఐశ్వర్య డీకేఎస్ హెగ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె శుక్రవారం కనకపుర లోక్ సభ నియోజకవర్గంలో తన ఓటు హక్కు వినియోగించు కున్నారు. ఈ సందర్బంగా ఐశ్వర్య డీకేఎస్ హెగ్డే సంచలనంగా మారారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు.
దేశం గురించి, రాష్ట్రం గురించి ఆమె తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెలిబుచ్చారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించు కోవాలని అన్నారు. లేక పోతే మనం ఈ దేశంలో ఉన్నా లేనట్టేనని పేర్కొన్నారు. ఓటు వేయక పోతే మనం అడిగే హక్కును కోల్పోతామని స్పష్టం చేశారు ఐశ్వర్య డీకే శివకుమార్.
ఒక పార్టీ పనిగట్టుకుని ఈ దేశం తనదంటూ కొత్త రాగం అందుకుందని, కానీ 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. దేశం అభివృద్ది చెందితే మనందరం డెవలప్ అవుతామని అన్నారు.
భారతదేశం గర్వించేలా ప్రతి ఒక్కరూ వివిధ రంగాలలో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు ఐశ్వర్య డీకే శివకుమార్. తాను రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదన్నారు.