ఫాక్స్ కాన్ సంస్థ ఎక్కడికీ పోలేదు
శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ – ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు అబద్దాలు ఆడుతున్నారని, కావాలని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఫాక్స్ కాన్ సంస్థ ఎక్కడికీ పోలేదన్నారు. సదరు సంస్థ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయబోతోందన్నారు.
ఫాక్స్ కాన్ లాంటి సంస్థలు రావాలని కోరుకోవాలే తప్పా ఇలా దుష్ప్రచారం చేస్తారా అంటూ ప్రశ్నించారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్ పై. తను ఇంకా పదవిలో ఉన్నారని భావిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని గుర్తుంచు కోవాలని హితవు పలికారు. ప్రచారం చేసుకోవడం తప్పితే చేసింది ఏమీ లేదన్నారు. తాము ఆచరణలో తీసుకు రావాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు శ్రీధర్ బాబు. రాష్ట్రంలో ఏదో జరిగి పోతోందంటూ భయభ్రాంతులకు గురి చేయాలని చూడడం మంచి పద్దతి కాదన్నారు.
తాము వచ్చాక ఐటీ పాలసీపై సమీక్ష చేపట్టడం జరిగిందన్నారు ఐటీ శాఖ మంత్రి.