నాలుగు రోజుకు చేరిన ఐటీ తనిఖీలు
హైదరాబాద్ – తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ బృందాలు జరుపుతున్న సోదాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఆయన నిర్మాణ సారథ్యంలో గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదలయ్యాయి.
చెర్రీ సినిమా ఢమాల్ కాగా వెంకీ మూవీ మాత్రం రూ. 230 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులకు సంబంధించి పలు కీలక పత్రాలు పరిశీలిస్తున్నారు. మహిళా అధికారి ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. దిల్ రాజు సోదరుడు శిరీష్ ఇంట్లో తనిఖీలు ముగిశాయి.
మరో వైపు దిల్ రాజు సతీమణి తేజస్వినికి చెందిన బ్యాంకుల ఖాతాలను పరిశీలించారు. లాకర్లను ఓపెన్ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎప్పుడూ జరిగే తనిఖీలేనంటూ పేర్కొన్నారు. ఇందులో ఆందోళన చెందాల్సింది ఏముందంటూ ప్రశ్నించారు.
మరో వైపు టాలీవుడ్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పుష్ప-2 నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స నివాసాలు, ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. సింగర్ సునీత భర్త కంపెనీపై కూడా దాడులు చేశారు. మొత్తంగా దిల్ రాజు కు కోలుకోలేని షాక్ తగిలిందని చెప్పక తప్పదు.