Saturday, April 19, 2025
HomeENTERTAINMENTదిల్ రాజుకు షాక్ ఐటీ ఝ‌ల‌క్

దిల్ రాజుకు షాక్ ఐటీ ఝ‌ల‌క్


నివాసాలు, ఆఫీసుల‌లో సోదాలు

హైద‌రాబాద్ – ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజుకు బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న‌కు చెందిన నివాసాలు, ఆఫీసుల‌లో ఐటీ శాఖ అధికారులు దాడులు చేప‌ట్టారు. ఏక కాలంలో 8 చోట్ల 55 బృందాల‌తో త‌నిఖీలు చేప‌ట్టారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో దిల్‌ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీశ్‌, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ ఐటీ టీమ్స్ జ‌ల్లెడ ప‌డుతున్నారు. అంతే కాకుండా వ్యాపార భాగ‌స్వాముల నివాసాల్లోనూ త‌నిఖీలు చేప‌ట్టారు. దీనిపై ఇంకా మాట్లాడేందుకు ఇష్ట ప‌డ‌లేదు దిల్ రాజు.

ఈ ఏడాది ఎఫ్డీసీ చైర్మ‌న్ దిల్ రాజుకు చెందిన రెండు సినిమాలు విడుద‌ల‌య్యాయి. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా హీరో రామ్ చ‌ర‌ణ్ , బాలీవుడ్ ల‌వ్లీ బ్యూటీ కియారా అద్వానీ క‌లిసి న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ విడుద‌లైంది.

ఇదే స‌మ‌యంలో సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా మ‌రో మూవీని నిర్మించారు. మినిమం గ్యారెంటీ ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విక్ట‌రీ వెంక‌టేశ్, మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేశ్ క‌లిసి న‌టించిన సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రం విడుద‌ల చేశారు. గేమ్ ఛేంజ‌ర్ పై భారీ ఖ‌ర్చు పెట్టి తీశారు. ఈ మూవీ ఫెయిల్యూర్ కాగా మ‌రో వైపు వెంకీ మూవీ దుమ్ము రేపింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments