NEWSINTERNATIONAL

మోడీని క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది – మెలోనీ

Share it with your family & friends

ఇట‌లీ దేశ ప్ర‌ధాన‌మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

బ్రెజిల్ – భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీతో భేటీ కావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ఇట‌లీ దేశ ప్ర‌ధాన మంత్రి జార్జియా మెలోనీ. బ్రెజిల్ లోని రియో డి జెనీరో వేదిక‌గా జ‌రుగుతున్న జి20 శిఖ‌రాగ్ర స‌దస్సు సంద‌ర్బంగా మంగ‌ళ‌వారం మెలోనీ పీఎం మోడీతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు.

భార‌త్, ఇట‌లీ దేశాల మ‌ధ్య బంధం మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని పేర్కొన్నారు మెలోనీ. ఈ సంద‌ర్బంగా ఎక్స్ వేదిక‌గా త‌న అభిప్రాయ‌ల‌ను పంచుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, కొత్త, అభివృద్ధి చెందుతున్న వంటి కీలక రంగాలలో భార‌త్ ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-29 ను రూపొందించ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు జార్జియా మెలోనీ.

భారతదేశం-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి త‌మ‌ ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించగలిగే సంభాషణకు ఒక విలువైన అవకాశం ద‌క్క‌డం సంతోషంగా ఉంద‌న్నారు. సాంకేతికత‌, క్లీన్ ఎనర్జీ, స్పేస్, డిఫెన్స్, కనెక్టివిటీ పై ఫోక‌స్ పెట్ట‌డం జ‌రిగింద‌ని చెప్పారు మెలోనీ.

ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు, పౌరుల ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, స్థిరమైన అభివృద్ధి, భాగస్వామ్య విలువలకు మద్దతుగా త‌మ‌ ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా క‌లిసి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించ‌డం జ‌రిగింద‌న్నారు.