మా నాన్నే అమెరికాకు సరైన లీడర్
డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్
అమెరికా – అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవానా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశం ఇబ్బందుల్లో ఉందని, ఈ దేశం బాగు పడాలన్నా లేదా అభివృద్ది లోకి రావాలన్నా తిరిగి తన తండ్రి ట్రంప్ అధ్యక్షుడైతేనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు.
సోమవారం ఇవాంకా ట్రంప్ మీడియాతో మాట్లాడారు తన తండ్రి ట్రంప్ తో కలిసి. తన తండ్రి గురించి ఆమె గొప్పగా చెప్పారు. ఇప్పటికే ట్రంప్ మనుమరాలు సైతం ఆయన వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్పిందని ఈ సందర్బంగా గుర్తు చేశారు.
ప్రస్తుతం దేశాన్ని ఏలుతున్న జోసెఫ్ బైడెన్ హయాంలో అమెరికా గుర్తింపునకు నోచుకోలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ ప్రపంచం మొత్తం ప్రస్తుతం జరగబోయే దేశ అధ్యక్ష ఎన్నికల కోసం ఎంతో ఆతృతతో, ఆసక్తితో ఎదురు చూస్తోందని చెప్పారు ఇవాంకా ట్రంప్.
దేశానికి ఉక్కు సంకల్పం, పట్టుదల , దేశభక్తి , తలవంచని మనస్తత్వం కలిగిన నాయకుడు కావాలని, అలాంటి లక్షణాలు కలిగిన ఏకైక నాయకుడు తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ మాత్రమేనని ప్రకటించారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో తన తండ్రికి మరోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యేలా చూడాలని కోరారు .