రోజా సాయం మరిచి పోలేను
జబర్దస్త్ రాకేశ్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – జబర్దస్త్ స్టార్ రాకింగ్ రాకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి గురించి వ్యక్తిగత విమర్శలు చేస్తున్న తరుణంలో ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. తను కష్ట కాలంలో ఉన్న సమయంలో ఆదుకున్నారని కొనియాడారు. ఆమెకు మోసం చేయడం తెలియదన్నారు.
తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో డబ్బులు సాయం చేశారంటూ ఆర్కే రోజా సెల్వమణి గురించి గొప్పగా చెప్పారు. అడిగినా , అడగక పోయినా తను సాయం చేసే మనస్తత్వం కలిగి ఉన్నారని తెలిపారు. రోజమ్మ తనకు అమ్మ లాంటిదని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు జబర్దస్త్ రాకేశ్.
జడ్జిగానే కాకుండా మానవతా దృక్పథంతో ఆదుకున్నారని పేర్కొన్నారు. తనకు కూతురు పుట్టాక తెలిసిన వెంటనే తొలుత వచ్చి పలకించింది ఆర్కే రోజా అని తెలిపారు. చాలా సార్లు తనను కష్ట కాలంలో ఆదుకున్నారని, చేసిన సాయం గురించి చెప్పక పోతే నేరం చేసినట్లవుతుందని చెప్పారు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాకేశ్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంత చేశాక కూడా చెప్పక పోతే ఎలా అని ప్రశ్నించాడు. ఆర్కే రోజా సెల్వమణి తనకు తల్లితో సమానమని చెప్పాడు రాకింగ్ రాకేశ్ .