NEWSTELANGANA

సింగ‌రేణి బొగ్గు గ‌నుల వేలం

Share it with your family & friends

భ‌గ్గుమ‌న్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

హైద‌రాబాద్ – మాజీ మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న కాంగ్రెస్, బీజేపీ ప్ర‌భుత్వాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్టాడారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డి తెలంగాణ ఆత్మ గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టే ప‌నిలో బిజీగా ఉన్నారంటూ మండిప‌డ్డారు. సింగ‌రేణి బొగ్గు గ‌నుల వ్య‌వ‌హారంపై ఎందుకు సీఎం నోరు విప్ప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

ఈ అంశంలో తెలంగాణ‌కు బీఆర్ఎస్ పార్టీనే ర‌క్ష‌ణ క‌వ‌చం అని తేలి పోయింద‌న్నారు మాజీ మంత్రి.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ హక్కులను ఇతరులకు ధారాదత్తం చేస్తున్న ప్రతీసారి బీఆర్ఎస్ పోరాటం చేస్తోంద‌న్నారు. కేఆర్ఎంబీ విష‌యంలోనూ ఇదే జ‌రిగింద‌న్నారు.

ఇవాళ సింగరేణి బ్లాక్‌ల వేలంపై కేటీఆర్ ప్రశ్నించిన తర్వాతే కాంగ్రెస్ తన వైఖరి మార్చుకుందన్నారు.
భట్టి విక్రమార్క పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీలు కూడబలుక్కుని డ్రామాలు ఆడుతున్నాయ‌ని ఆరోపించారు.

శ్రావణపల్లి బ్లాక్‌ను వేలం పాట నుంచి తీసేయాల‌ని తాము డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. కిష‌న్ రెడ్డికి ఎన్ని ప‌ద‌వులు వ‌చ్చినా తెలంగాణ‌కు న‌ష్టం త‌ప్ప లాభం లేద‌న్నారు.