రేవంత్ రెడ్డి కామెంట్స్ జగదీశ్ రెడ్డి సెటైర్
మతాల కోసం నదులు పుట్టవు మహాశయా
హైదరాబాద్ – మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పేరుతో మాట్లాడిన మాటలు అత్యంత సత్య దూరంగా ఉన్నాయని, చరిత్ర తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.
నీళ్ళ వెంట మానవ నాగరికతలు వస్తాయ్ గానీ, మతాల కోసం నదులు పుట్టవ్ అని పేర్కొన్నారు జగదీశ్ రెడ్డి. తెలంగాణ ను, హైదరాబాద్ ను, మూసి ని కఠోర తపస్సు చేసి కనుగొన్న సముద్రగర్భ-భూగర్భ-ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆచార్య రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు జగదీశ్ రెడ్డి.
మూసీ పుట్టుక భూగోళం పుట్టుకతో నే ప్రారంభం అయిందని, ఆ తర్వాత లక్షల సంవత్సరాల కి దాని వెంట మానవ ఆవాసాలు వచ్చినై, నువ్వు చెప్పిన జీసస్ ,మోసెస్ ల పేర్లు ఈ ప్రపంచానికి పరిచయం అయ్యి 2000 సంవత్సరాలేనని పేర్కొన్నారు .
కానీ అంతకంటే ముందే మన నదులకు ఈసా, మూసా,మూసి అనే పేర్లు వున్నాయి, అక్కడ మానవ జాతి ఉన్నది, ఇది భారతీయ ఈ చరిత్ర. ఇక్కడ మూసి అనేది ఒకటి ఉందని కూడా వాళ్ళకి (జీసస్ ,మోజెస్ ) లకు తెలిసే అవకాశం లేదన్నారు.
నువ్ జెప్పిన మగ్గా (మక్కా) మసీదు నిర్మాణం జరిగి బహుశా నాలుగు వందల సంవత్సరాలు (1693) కూడా నిండలేదన్నారు. కానీ వేల సంవత్సరాల క్రితమే మూసి వెంట తెలంగాణ (భారతీయ) నాగరికత వెళ్ళి విరిసిందని తెలుసుకుంటే మంచిదన్నారు.
నీళ్ళ వెంట మానవ నాగరికతలు వస్తాయి గానీ, మతాల కోసం నదులు పుట్టవని తెలుసుకోక పోవడం దారుణమన్నారు. దయచేసి ఇక నుండి అయినా తెలిసింది మాత్రమే మాట్లాడు, లేదా నీకు స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళని అయినా మార్చుకో, కానీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల, పది కోట్ల తెలుగు ప్రజల పరువు మాత్రం తియ్యకు ప్రపంచం ముందు అంటూ సూచించారు జగదీశ్ రెడ్డి.