NEWSTELANGANA

రేవంత్ ద‌మ్ముంటే ట‌చ్ చేసి చూడు

Share it with your family & friends

నిప్పులు చెరిగిన జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతొ మాట్లాడారు. రేవంత్ కు ద‌మ్ముంటే తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ట‌చ్ చేసి చూడాల‌ని అన్నారు. సీఎంకు అంత సీన్ లేద‌న్నారు.

ఒక‌వేళ త‌న‌కు గ‌ట్స్ గ‌నుక ఉంటే వెంట‌నే అరెస్ట్ చేసేందుకు రావాల‌ని స‌వాల్ విసిరారు. ఇలాంటి వాళ్ల‌ను చాలా మంది కేసీఆర్ చూశార‌ని అన్నారు. త‌న రాజ‌కీయ జీవితంలో కేసీఆర్ ను ఢీకొనే నేత‌ను తాను ఇంత‌వ‌ర‌కు చూడ‌లేద‌న్నారు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి.

కేసీఆర్ ని ముట్టుకునే దమ్ము లేకనే , ఆయన్ని బ‌ద్నాం చెయ్యడానికి భజన ఛానల్స్,పేపర్స్ లో పది నెలల నుండి ఇవ్వాళ‌ కెసిఆర్ అరెస్ట్ రేపు అరెస్ట్ అని లీకులు ఇస్తున్నాడని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు

ఎన్ని విచారణ కమిషన్ లు వేసుకున్నా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌న్నారు. కేసీఆర్ కడిగిన ముత్యం లా బయటికి వస్తాడని ధీమా వ్య‌క్తం చేశారు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి.

పాల‌న చేతకాక చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని , లేక‌పోతే ప్ర‌జ‌లు ఛీద‌రించుకునే ప‌రిస్థితి త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు.