ఆధారాలు లేకుండా అరెస్ట్ లు చెల్లవు
మాజీ మంత్రి గుండ్లకట్ల జగదీశ్వర్ రెడ్డి
హైదరాబాద్ – ప్రజాస్వామ్యంలో ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం చెల్లవని స్పష్టం చేశారు మాజీ మంత్రి గుండ్లకట్ల జగదీశ్వర్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ చీఫ్ కొణతం దిలీప్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇవాళ ఆయనను విడుదల చేశారు.
ఈ సందర్బంగా జగదీశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని అన్నారు. కొణతం దీలీప్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారని, 9 నెలల పాలనా కాలంలో గాడి తప్పిన విధానంపై నిలదీశారని దీనిని తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కక్ష కట్టిందని ఆరోపించారు.
ప్రశ్నించడం ప్రజాస్వామ్యానికి బలం చేకూరుస్తుందని, చివరకు ఎలాంటి ఆధారాలు చూపించ లేక పోయారంటూ పోలీసులపై మండిపడ్డారు. ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ వచ్చిన వారిని టార్గెట్ చేశారని , కావాలని కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చివరకు ఎలాంటి ఆధారం కొణతం దిలీప్ రెడ్డి విషయంలో చూపించ లేక పోయారని ఎద్దేవా చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.