Thursday, April 17, 2025
HomeNEWSకోమ‌టిరెడ్డి ప్ర‌వ‌ర్త‌న దారుణం

కోమ‌టిరెడ్డి ప్ర‌వ‌ర్త‌న దారుణం

మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

సూర్యాపేట జిల్లా – మంత్రి హోదాలో ఉండి ఆటవికంగా ప్రవర్తించడం కోమటిరెడ్డికే చెల్లిందని మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మండిప‌డ్డారు. భువనగిరి జడ్పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై జరిగిన దాడి దారుణ‌మ‌న్నారు. అధికారిక పర్యటనలో పాల్గొన్న జడ్పి చైర్మన్ పై జరిగిన దాడిని జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు.

రక్షించాల్సిన పోలీసులు సందీప్ రెడ్డిని నెట్టి వేయడం దురదృష్టకరమన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిజిపిని డిమాండ్ చేశారు. మంత్రి హోదాలో ఉన్న కోమటిరెడ్డి సత్ప్రవర్తనతో ఉంటారనుకుంటే అందుకు భిన్నంగా అహంకారంతో ప్రవర్తిస్తున్నారని జ‌గ‌దీశ్ రెడ్డి విమర్శించారు. చైతన్యాన్ని పుణికి పుచ్చుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు తలకెక్కిన అహంకారాన్ని కిందకు దించుతారని అన్నారు.

కోమటిరెడ్డి చేసిన దీక్ష తెలంగాణ కోసం ఎంత మాత్రం కానే కాదని ఆయన తేల్చి చెప్పారు. నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి ని ఖచ్చితంగా మంత్రి పదవి నుండి తొలగిస్తారని తెలుసుకునే దీక్ష జపం మొదలు పెట్టారని ఆరోపించారు.

ఊడిపోయే పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం రాజీనామా అన్నట్లు నమ్మ పలికే విధంగా త్యాగాల ట్యాగ్ ను పదేళ్ల నుండి మెడకేసుకుని తిరుగుతున్నాడని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ బూట్లు నాకుతూ పదవులు కాపాడుకునేందుకు ప్రసన్నం చేసుకున్న చరిత్ర కోమటిరెడ్డిది అని ఘాటుగా విమర్శించారు.

తాజాగా వచ్చిన మంత్రి పదవి కూడా రేవంత్ రెడ్డి బెడ్ రూమ్ లోకి పోయి కాళ్ళ మీద పడితేనే వచ్చిందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments