మాజీ మంత్రి గుండ్లకట్ల జగదీశ్ రెడ్డి
మిర్యాల గూడ – మాజీ మంత్రి గుండ్లకట్ల జగదీశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరంతరం అబద్దాలు ఆడే కోమటి రెడ్డికి చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ ఆపుతా అన్నావు కదా నీకు దమ్ముంటే ఇప్పుడు ఆపు చూద్దామంటూ సవాల్ విసిరారు జగదీశ్వర్ రెడ్డి . ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజల చెవుల్లో పూలు పెట్టింది చాలక తమపై దాడులకు దిగడం, అసత్య విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఇకనైనా కోమటిరెడ్డి తన నోటిని అదుపులో ఉంచు కోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీది కాదా అని నిలదీశారు. బీఆర్ఎస్ ను భూ స్థాపితం చేస్తామంటూ ప్రగల్భాలు పలకడం మాను కోవాలని హితవు పలికారు జగదీశ్ రెడ్డి.