Saturday, April 19, 2025
HomeNEWSANDHRA PRADESHవైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల నియామ‌కం

వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల నియామ‌కం

ప్ర‌క‌టించిన సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – పార్టీ బ‌లోపేతంపై మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టి సారించారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను నియ‌మించారు. అన‌కాప‌ల్లి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కుడిగా క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ‌కి ఛాన్స్ ఇచ్చారు. చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం కో ఆర్డినేట‌ర్ గా మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ , మాడుగుల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ముత్యాల నాయుడును నియ‌మించారు పార్టీ బాస్.

ఇక‌ భీమిలి నియోజ‌క‌వ‌ర్గానికి మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు అలియాస్ చిన్న శ్రీ‌ను ను ఇంఛార్జ్ గా , గాజువాక నియోజ‌క‌వ‌ర్గానికి కోఆర్డినేట‌ర్ గా తిప్ప‌ల దేవ‌న్ రెడ్డి , పి. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా శ్రీ‌నివాస‌రావు, పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధిగా వరికూటి అశోక్ బాబును ఎంపిక చేసిన‌ట్లు వైఎస్సార్పీపీ కేంద్ర క‌మిటీ వెల్ల‌డించింది.

మ‌రో వైపు ఈ నెల‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ర్య‌టించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న కూతురు వ‌ర్షా రెడ్డి కాన్వోకేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు స‌తీ స‌మేతంగా లండ‌న్ కు వెళ్లారు. అక్క‌డి నుంచి తిరిగి వ‌చ్చాక ప్ర‌జలతో మమేకం అయ్యేందుకు పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments