జగన్ రెడ్డి ఏపీ పరువు తీశారు – షర్మిల
ఏపీపీసీసీ అధ్యక్షురాలు షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తన సోదరుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువును తీసేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జగన్ రెడ్డిపై. తాజాగా దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు ప్రముఖ వ్యాపార, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ , మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఏపీ సీఎంగా ఉన్న సమయంలో పోర్టులు, ఇతర పనులు కట్టబెట్టినందుకు గాను లంచగా ఏకంగా రూ. 1750 కోట్లు ఇచ్చాడని అమెరికా ఆరోపించింది. ఇప్పటికే అదానీని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేసింది. దీనిపై సీరియస్ గా స్పందించారు ఏఐసీసీ మాజీ చీఫ్ , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ. అంతే కాదు ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీని, అదానీతో పాటు తమ పార్టీకి చెందిన వారు ఎవరు ఉన్నా సరే ముందు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ తరుణంలో పార్టీ సీనియర్ నేత చెప్పినట్టుగానే ఇవాళ వైఎస్ షర్మిలా రెడ్డి సీరియస్ గా స్పందించడమే కాదు జగన్ రెడ్డి చేసిన నిర్వాకం తల దించుకునేలా ఉందన్నారు. ఇద్దరూ కలిసి దేశ పరువును తాకట్టు పెట్టారంటూ ధ్వజమెత్తారు.