జగన్ షాకింగ్ కామెంట్స్
ఇలా జరుగుతుందని అనుకోలేదు
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను కలలో కూడా అనుకోలేదని ఓడిపాతమని పేర్కొన్నారు. జగన్ మీడియాతో మాట్లాడారు. గెలుపొంది కూటమికి అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని, కానీ ఎందుకు తిరస్కరించారనేది తెలియడం లేదన్నారు జగన్ రెడ్డి.
పిల్లలు బాగుండాలని, వాళ్ల చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ.. అమ్మ ఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేశామన్నారు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు గతంలో ఎన్నడూ జరగని విధంగా లబ్ది చేకూర్చామని చెప్పారు జగన్ రెడ్డి.
దాదాపుగా 1 కోటి 5 లక్షల మంది పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్లకు అండగా ఉంటూ… ఆసరా, చేయూతతో తోడుగా ఉన్నామన్నారు.
దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయం అందించే కార్యక్రమం మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగిందన్నారు. విద్యా, ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశామన్నారు జగన్ రెడ్డి.