DEVOTIONAL

పూరీ క్షేత్రం జ‌గ‌న్నాథ మ‌యం

Share it with your family & friends

ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌తో కిట‌కిట

ఒడిశా – జ‌గ‌న్నాథుని ర‌థ యాత్ర అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతోంది. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు హాజ‌ర‌య్యారు. భారీ ఎత్తున తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ కార్య‌క్ర‌మానికి భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముతో పాటు సీఎం మోహ‌న్ చ‌ర‌ణ్ మాఝీ, మాజీ సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ,ఇత‌ర ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు. భారీ ఎత్తున భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు.

జూలై 7న ఆదివారం ప్రారంభ‌మైంది జ‌గ‌న్నాథుని ర‌థ యాత్ర‌. ఇది రెండు రోజుల పాటు కొన‌సాగ‌నుంది. ర‌థ యాత్ర అనేది ఒక రోజు కార్య‌క్ర‌మం. కానీ నిర్దిష్ట ఖ‌గోళ ఏర్పాట్ల కార‌ణంగా ఈ ఏడాది రెండు రోజుల పాటు కొన‌సాగుతుంది.

ఇది చివ‌రి సారిగా 1971లో క‌నిపించింది. ఆ త‌ర్వాత ఇప్పుడు 2024లో క‌నిపించ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా దేవి సుభద్ర‌, బ‌ల భ‌ద్ర భ‌గ‌వానుని ర‌థోత్స‌వం. రాష్ట్ర‌ప‌తి ముర్ము ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా భారీ ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

కాగా జ‌గ‌న్నాథుని ర‌థ యాత్ర కోసం జూలై 7, 8 రెండు రోజుల పాటు ప్ర‌భుత్వ ప‌రంగా సెల‌వు ప్ర‌క‌టించారు సీఎం మాఝీ.