పాలనపై ఇంకొకరి పాఠాలు అక్కర్లేదు
నిప్పులు చెరిగిన ఉప రాష్ట్రపతి ధన్ ఖర్
న్యూఢిల్లీ – భారత దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ నిప్పులు చెరిగారు. తమ దేశానికి సంబంధించిన పాలన వ్యవహారాలకు సంబంధించి ఇంకొకరు కామెంట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.
ఈ సందర్బంగా ఢిల్లీ సీఎం అరెస్ట్ చేయడంపై జర్మనీ, అమెరికాతో పాటు ఐక్యరాజ్య సమితి కీలక వ్యాఖ్యలు చేశాయి. ఆయన అరెస్ట్ అక్రమం అంటూ మండిపడ్డాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్.
తమ దేశంలో జరిగే వ్యవహారాలకు సంబంధించి ఇంకో దేశం లేదా వ్యక్తులు , నేతలు మాట్లాడాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ ప్రశ్నించారు. ఇది తమకు మాత్రమే సంబంధించిన వ్యవహారం అంటూ స్పష్టం చేశారు. ఎవరిని ఎప్పుడు అదుపులోకి తీసుకోవాలో, ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలో ఇంకొకరు ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ మండిపడ్డారు. ఎవరి పరిధిలో వారుంటే మంచిదని సూచించారు. మీతో పాఠాలు చెప్పించు కోవాల్సిన అవసరం లేదన్నారు ధన్ ఖర్.