జీవన్ రెడ్డి ఆవేదన జగ్గన్న ఆందోళన
నీవు ఒంటరివి కావు నీకు నేను ఉన్నా
హైదరాబాద్ – టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోంది మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి గురించి. ఆయనకు సంబంధించిన ముఖ్య అనుచరుడు గంగా రెడ్డిని ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి హస్తం కండువా కప్పుకున్న ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు జీవన్ రెడ్డి. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఈ సందర్బంగా తట్టుకోలేక తాను కీలక లేఖ రాశారు ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు.
ఈ సందర్బంగా జగ్గా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత నిబద్దత కలిగిన నాయకుడు జీవన్ రెడ్డి అంటూ కితాబు ఇచ్చారు. తాను ఆయనకు పూర్తి మద్దతు ఇస్తున్నానని అన్నారు. ఆయన ఆవేదన చూసి తనకు బాధ అనిపించిందని చెప్పారు. ఆయన ఒంటరి వాడు కాదన్నారు. మీ వెంట తాను ఉంటానని ప్రకటించారు జగ్గా రెడ్డి.
నిత్యం జనం మధ్యలో ఉండే అరుదైన నాయకుడు మా జీవన్ రెడ్డి అని, అయితే తామిద్దరం ఈసారి ఎన్నికల్లో ఎందుకు ఓడి పోయామో అర్థం కావడం లేదంటూ వాపోయారు జగ్గారెడ్డి.