గూడు లేనోడు రాహుల్
సీనియర్ నేత జగ్గారెడ్డి
హైదరాబాద్ – కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీది రాజ పుట్టుక అని అన్నారు. ప్రస్తుతం రాహుల్ ఉండేందుకు కూడా ఇల్లు లేకుండా పోయిందన్నారు.
రాహుల్ గాంధీది ఘనమైన వారసత్వమని , వారు ముందు నుంచీ ఉన్నత కుటుంబమని పేర్కొన్నారు. ముత్తాత మోతీలాల్ నెహ్రూ ఆయనకు ఉన్న లక్షల ఆస్తులన్నీ భారత స్వాతంత్ర ఉద్యమం కోసం ఇచ్చేశారని చెప్పారు. అందుకే రాహుల్ కు ఉండేందుకు నిలువ నీడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవాళ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ చరిత్రలో అరుదైన రికార్డ్ నమోదు చేసిందన్నారు. లక్షలాది మందికి ఈ యాత్ర భరోసా కల్పించిందని చెప్పారు. వేలాది కిలోమీటర్లు తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారని అన్నారు. తమ మేని ఫెస్టో భగవద్గీత లాంటిదన్నారు జగ్గారెడ్డి.