సీఎంను విమర్శిస్తే బూటుతో కొడతాం
జగ్గారెడ్డి సంచలన కామెంట్స్
హైదరాబాద్ – కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తమ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురించి నోరు పారేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆదివారం జగ్గా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ షాకింగ్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తమ నాయకుడు కేసీఆర్ ను రండ అంటే ఊరుకోమన్నారు. అంతే కాదు రేవంత్ ను ఇప్పటికిప్పుడు చెప్పుతో కొట్టాలని ఉందని, కానీ సంస్కారం అడ్డు వస్తుందని అన్నారు బాల్క సుమన్.
ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఫిర్యాదు చేశారు. తాజాగా మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇవాళ బాల్క సుమన్ కు ఎస్ఐ నోటీసు ఇచ్చారు. విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు జగ్గారెడ్డి . ఇక నుంచి ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ల భరతం పడతామని, సీఎంను విమర్శిస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు. బూటుతో సమాధానం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.