టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి
హైదరాబాద్ – టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ ఫలితాలపై స్పందించారు. తమ పార్టీ పుంజుకుందని, బీజేపీ అడ్డగోలు హామీలతో మభ్య పెట్టిందని, అందుకే గెలిచిందన్నారు. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు అహం పెరిగిందన్నారు. అవినీతి నిర్మూలన పేరుతో ఏర్పాటైన ఆప్ ఇవాళ కరప్షన్ కు కేరాఫ్ గా మారడం దారుణమన్నారు. అందుకే రాహుల్ గాంధీ పొత్తు పెట్టుకునేందుకు ఒప్పు కోలేదన్నారు. తనతో ఢీకొనే సత్తా కేజ్రీవాల్ కు లేదన్నారు.
సోమవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆప్ పై , అధినేతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ను ఏకి పారేశారు. బీఆర్ఎస్ తో జత కట్టడం వల్లనే ఆప్ గ్రాఫ్ తగ్గిందన్నారు. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కొంప ముంచేలా చేసిందన్నారు. ప్రజలను ఎంత కాలం మభ్య పెట్టలేరని అన్నారు.
ఈసారి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు గణనీయంగా తమకు ఓట్లు వేశారని చెప్పారు. రాహుల్ గాంధీ పర్సనాలిటీని డామినేట్ చేసే సత్తా కేజ్రీవాల్‌ది కాదన్నారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి లేదన్నారు.
ఒంటరిగా వెళ్లి పార్టీని బలోపేతం చేసుకోవాలని రాహుల్ గాంధీ భావించారని అనుకుంటున్నట్లు తెలిపారు జగ్గా రెడ్డి. కొట్లాడడానికి సిద్ధం కమ్మని ఢిల్లీ ఎన్నికల ద్వారా క్యాడర్‌కి ఇండికేషన్ ఇచ్చారని భావిస్తున్నానని చెప్పారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజు కోవడం ఖాయమన్నారు.