NEWSTELANGANA

కేటీఆర్ కామెంట్స్ జ‌గ్గారెడ్డి సీరియ‌స్

Share it with your family & friends

పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోం

హైద‌రాబాద్ – టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏకి పారేశారు. ఆయ‌న త‌న నోరు జాగ్ర‌త్తగా పెట్టుకోక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

ఈ మ‌ధ్య కాలంలో కేటీఆర్ త‌న స్థాయికి దిగ‌జారి మాట్లాడుతున్నాడ‌ని, పిచ్చి పిచ్చిగా వాగితే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు జ‌గ్గారెడ్డి. మంగ‌ళ‌వారం జ‌గ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు ఉచిత స‌ల‌హా కూడా ఇచ్చారు . కొంచెం ఎలా మాట్లాడాలో కూడా శిక్ష‌ణ ఇప్పిస్తే బావుటుందని అన్నారు.

ఈ దేశ భ‌విష్య‌త్తును మార్చిన అరుదైన నాయ‌కుడు, దివంగ‌త ప్ర‌ధాన‌మంత్రి రాజీవ్ గాంధీ అని, ఆయ‌న తీసుకు వ‌చ్చిన సాంకేతిక విప్ల‌వ‌మే ఇవాళ ల‌క్ష‌లాది మందికి ఉపాధి క‌ల్పించేలా చేసింద‌న్నారు జ‌గ్గారెడ్డి. ఇది తెలుసు కోకుండా అవాకులు చెవాకులు పేలితే ఊరుకోమ‌ని వార్నింగ్ ఇచ్చారు.

రాజీవ్‌ గాంధీ విగ్రహం సెక్రటేరియట్‌ ముందు తీసేస్తాం అంటాడా.? రాజీవ్‌గాంధీ 18 ఏళ్లు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు. ఆయ‌న‌ తెచ్చిన టెక్నాలజీతో ఉద్యోగం తెచ్చుకుని ఆయన్నే తిడితే నిన్ను ఏమనాలి అంటూ మండిప‌డ్డారు జ‌గ్గారెడ్డి.