NEWSTELANGANA

కాళ్లు మొక్కింది మ‌రిచి పోతే ఎలా

Share it with your family & friends

విజ‌య సాయి రెడ్డిపై జ‌గ్గారెడ్డి ఫైర్

హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గా రెడ్డి నిప్పులు చెరిగారు. త‌మ ప్ర‌భుత్వంపై అనుచిత కామెంట్స్ చేసిన వైసీపీ ఎంపీ విజ‌య సాయిరెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గాంధీ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నువ్వు ఎంపీవా లేక బ్రోక‌ర్ వా అంటూ షాకింగ్ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఆనాడు విజ‌య సాయి రెడ్డి కేసీఆర్ కాళ్లు మొక్కింది మ‌రిచి పోయావా అంటూ ఎద్దేవా చేశారు. ఇంకోసారి త‌మ ప్ర‌భుత్వం గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు. ఒక బాధ్య‌త క‌లిగిన ఎంపీగా ఉన్న విజ‌య సాయి రెడ్డి ఆరు నెల‌ల్లో తెలంగాణ ప్ర‌భుత్వం కూలి పోతుంద‌ని చ‌ట్ట స‌భ‌లో చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

ఎవ‌రి అండ చూసుకుని మాట్లాడుతున్నావో చెప్పాల‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌లను త‌క్కువ అంచ‌నా వేశార‌ని, తాము త‌ల్చుకుంటే ఇక్క‌డ ఎవ‌రూ ఉండ‌ర‌న్నారు. త‌మ స‌ర్కార్ పై మాట్లాడే ముందు విజ‌య సాయి రెడ్డి ఆచి తూచి మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు.

లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జ‌గ్గా రెడ్డి. ఇక‌నైనా ఎంపీ ప‌ద్ద‌తి మార్చు కోవాల‌న్నారు.