NEWSINTERNATIONAL

దేశం ఫ‌స్ట్ పార్టీ సెకండ్ – జ‌గ్మీత్ సింగ్

Share it with your family & friends

షాకింగ్ కామెంట్స్ చేసిన ఖ‌లిస్తానీ నేత

కెన‌డా – భార‌త దేశానికి వ్య‌తిరేకంగా ఉద్య‌మం చేప‌ట్టిన ఖ‌లిస్తానీ నేత జ‌గ్మీత్ సింగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం కెన‌డా పార్ల‌మెంట్ లో ఆయ‌న చేసిన కామెంట్స్ ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. ఈ సంద‌ర్బంగా జ‌గ్మీత్ సింగ్ మాట్లాడుతూ దేశం ఫ‌స్ట్ పార్టీ సెకండ్ అంటూ పేర్కొన్నారు.

దీంతో పార్ల‌మెంట్ లో ఉన్న స‌భ్యులంతా న‌వ్వ‌డం విస్తు పోయేలా చేసింది. క‌న్స‌ర్వేటివ్ పార్టీ స‌భ్యులు న‌వ్వుతున్నార‌ని, కానీ భార‌త దేశం త‌మ‌కు వ్య‌తిరేకంగా కొంద‌రి వ్య‌క్తుల‌ను నియ‌మించింద‌ని ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా ప్రో ఇండియా క‌న్జ‌ర్వేటివ్ పార్టీ అన్ని స‌ర్వేల‌లో ముందంజ‌లో కొన‌సాగుతోంది. రాబోయే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా గెలుస్తుంద‌ని అన్నీ పేర్కొంటున్నాయి. దీంతో జ‌గ్మీత్ సింగ్ ప‌దే ప‌దే భార‌త్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో ఉండే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

విచిత్రం ఏమిటంటే కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో కూడా భార‌త్ పై నోరు పారేసుకున్నారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపింది భార‌త్. ఈ మేర‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు ప్ర‌ధాన‌మంత్రి మోడీ. ఇంకోసారి గ‌నుక త‌మ‌తో పెట్టుకుంటే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చరించారు. త్వ‌ర‌లో కెన‌డాలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో ఇరు దేశాల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది.