మోడీపై జైరాం షాకింగ్ కామెంట్స్
ప్రధానమంత్రిది అనైతిక పరాజయం
న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్ ఛార్జ్ జైరాం రమేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనది నైతిక, రాజకీయ పరాజయం అంటూ పేర్కొన్నారు.
దేశంలో గోడీ మోడియా పనిగట్టుకుని తమకు వ్యతిరేకంగా ప్రచారం చేసిందంటూ మండిపడ్డారు. ఏకంగా మోడీ జపం చేశాయని ఆరోపించారు. పదే పదే 400 సీట్లు వస్తాయంటూ అబద్దాలు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జైరాం రమేష్.
దేశాన్ని భ్రష్టు పట్టించిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. ఆయన నిర్వాకం కారణంగానే ఇవాళ దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగి పోయిందని ఆరోపించారు. అంతే కాదు మోడీ పాలన పట్ల ఎంతగా వ్యతిరేకతతో ఉన్నారనే విషయం తేలి పోయిందన్నారు జైరాం రమేష్.
ఇకనైనా తను నిజాలు చెబితే బావుండేదని పేర్కొన్నారు. మతం పేరుతో, కులం పేరుతో రాజకీయాలుచేయడం మాను కోవాలని సూచించారు.