టీపీసీసీ చీఫ్ కు బీసీ సంక్షేమ సంఘం ఫిర్యాదు
హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఆర్టీఐ కమిషనర్ పదవులలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. భర్తీ చేసిన ఆరు పోస్టులలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రయారిటీ ఇచ్చారని, 60 శాతానికి పైగా ఉన్న బహుజనులను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ విషయంపై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు. వినతి పత్రం అందజేశారు.
సీఎం రేవంత్ రెడ్డి తన సామాజిక వర్గానికి చెందిన వారికే నామినేటెడ్ పోస్టులలో నియమిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ సర్కార్ చర్యలు తీసుకోక పోతే తాము ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
టీపీసీసీ చీఫ్ ను కలిసిన బీసీ ప్రతినిధుల బృందంలో బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్ , బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ , బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, నాయకులు అయిలి వెంకన్న, ఎలికట్టు విజయ్ కుమార్, ఇంద్రం రజక, భాస్కర్ ఉన్నారు.